ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్,.సీ.
కరీంనగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జిల్లా...

కరీంనగర్:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో కలిసి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్ పరిధిలోని ప్రాంతాన్ని సీఎం సభాస్థలిగా ఎంపిక చేసిన నేపధ్యంలో కలెక్టర్ , సీ.పీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, వేదిక తదితర వాటి ఏర్పాట్లను నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీ.ఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని అన్నారు. ముందస్తుగానే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.
No Comment! Be the first one.