57వ డివిజన్ లో సిపిఐ ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. —-కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థినీ లతశ్రీ కసిరెడ్డిని గెలిపించి డివిజన్ అభివృద్ధికి తోడ్పాటు అందించండి.
కరీంనగర్ 57వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థిని లతశ్రీ కసిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు ఓటర్లకు...

కరీంనగర్
57వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థిని లతశ్రీ కసిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జీ వెలిచాల రాజేందర్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం 57 వ డివిజన్ లో సిపిఐ అభ్యర్థిని ఏర్పాటు ఎన్నికల కార్యాలయాన్ని రాజేందర్ రావు ప్రారంభించారు. ఎన్నికల ప్రచారాన్ని ఎల్. ఐ.సి.కార్యాలయం చౌరస్తా లో ప్రారంభించి దోభివాడ,గణేష్ నగర్ ప్రాంతాలలో ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు వల్లనే నగరం అభివృద్ధి చెందుతుందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రుల సహకారంతో కరీంనగర్ అభివృద్ధికి బాటలు వేస్తామని ,57వ డివిజన్ ను పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించామని కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థిని గెలిపించే బాధ్యత కాంగ్రెస్,సిపిఐ శ్రేణులపై ఉందని అన్నారు. డివిజన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండే లతశ్రీ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజేందర్ రావు డివిజన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,అభ్యర్థిని లతశ్రీ కసిరెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్,న్యాలపట్ల రాజు,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,సహాయ కార్యదర్శి పైడిపెల్లి రాజు,జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,మచ్చ రమేష్, నాయకులు గామినేని సత్యం,కూన రవి,నునావత్ శ్రీనివాస్,అంబరీష్ అంభ్రీష్ విష్ణు,వినయ్ తదితరులు పాల్గొన్నారు
No Comment! Be the first one.