*12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.* — వాల్ పోస్టర్ ఆవిష్కరణ…
కరీంనగర్ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ ల ను వెంటనే రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు బొమ్మకల్...

కరీంనగర్
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ ల ను వెంటనే రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు బొమ్మకల్ గ్రామంలోని సిమెంట్ గోదాముల వద్ద కార్మికులు సమ్మె వాల్ పోస్టర్ ను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా *ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్*, *ఉపాధ్యక్షులు జంగము తిరుపతి యాదవ్* *ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య* మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వాటాల అమ్మకం అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని,గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ఇతర రంగాల కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని,తదితర డిమాండ్లకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో సిమెంట్ హమాలి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
*ఈ కార్యక్రమంలో సిమెంటు గోదాం హమాలి సంగం ఏఐటీయూసీ నాయకులు బాగోతం వీరయ్య, కొమురయ్య, శ్రీనివాస్, ఐలయ్య, రాములు గౌడ్, శ్రీనివాస్ కొమురయ్య కార్మికులు పాల్గొన్నారు.*
No Comment! Be the first one.