ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలి — జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్...

కరీంనగర్
జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇక్కడ విద్యార్థుల జిమ్నాస్టిక్స్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ లో యోగ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. విద్యార్థుల రోజువారి ప్రాక్టీస్, ఆహార మెనూ తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల జిమ్నాస్టిక్స్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు.
కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
No Comment! Be the first one.