గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి.. —-తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క*
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి...

గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని, నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు.
No Comment! Be the first one.