పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ,– కమిషనర్ కపుల్ దేశాయ్
కరీంనగర్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ లో...

కరీంనగర్
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ లో భాగంగా నగరంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఆదివారం రోజు ప్రెసిడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్లకు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో శిక్షణ జరిగింది. మాస్టర్ ట్రైనర్లు సంపత్, అమరేంధర్ లు 11 వ తేదిన జరగబోయే పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు నిర్వహించాల్సిన విధుల పట్ల కూలంకషంగా వివరించారు. పిఓ, ఏపిఓలు, పోలింగ్ స్టేషన్ సిబ్బంది చేయాల్సిన పనుల పై సూచనలు చేస్తూ… వారి సందేహాలను తీర్చారు. పిఓ, ఏపిఓలు పోలింగ్ ముందు రోజు చేయాల్సిన పోలింగ్ స్టేషన్ వారిగా మెటిరియల్ స్వీకరణ, బ్యాలెట్ పేపర్ల చెకింగ్, నాలుగు సెట్ల ఎలక్ట్రోరల్ జాబితా,తదితర విషయాలను వివరించారు. పోలింగ్ రోజు పోలింగ్ సరలికి అనుకూలంగా మైక్రో అబ్జర్వర్ ఏజేంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ సీలింగ్, పోలింగ్ సరలి పూర్తైన తర్వాత బ్యాలెట్ బాక్స్ సిలింగ్ ఎలా చేయాలి…ఓటర్లను ఎలా గుర్తించాలి… బ్యాలెట్ పేపర్ అకౌంట్, పేపర్ సీల్ అకౌంట్ ఏ విధంగా పూర్తి చేయాలి…పోలింగ్ అధికారులు ఎన్నికల నిబంధనల డాక్యూమెంట్స్ ఏలా పూరించాలి… పిఓ డైరీలు, డిక్లరేషన్ ఏవిధంగా పూరించాలి అనే విషయాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ…. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ…. పిఓలు, ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది….పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి ప్రతి విషయాన్ని క్లుప్తంగా పరిశీలించాలన్నారు. పోలింగ్ ప్రక్రియకు కావల్సిన మెటిరియల్ సరిగా ఉందా లేదా చెక్ చేస్కోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ వారిగా ఓటర్ల జాబితాను, ఇచ్చిన బ్యాలెట్ లో పోటి అభ్యర్థుల పేర్లు ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేస్కోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ సరలిని తప్పక ప్రారంభించాలని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ తనిఖీ చేసి చూపించిన అనంతరమే బాక్స్ ను ప్రొసిజర్ ప్రకారం పోలింగ్ కు అనుకూలంగా సీల్ చేయాలన్నారు. పిఓలు నిబంధనల ప్రకారం ప్రతి డాక్యూమెంట్ ను తప్పక పూరించాలని సూచించారు. మొదటగా పోలింగ్ అధికారి ప్రతి ఓటర్ ను ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఓరిజినల్ గుర్తింపు కార్డుతో మాత్రమే ఓటుకు అనుమతించాలన్నారు. ఏజెట్ల అనుమతితోనే ఓటు వేయడానికి ఓటర్ ను అనుమతించాలన్నారు. ఓటర్ కు ఇంకు అప్లై చేసిన తర్వాతే బ్యాలెట్ పేపర్ ను ప్రొసిజర్ ప్రకారం మడిచి ఇచ్చి ఓటు వేయడానికి అనుమతించాలని సూచించారు. ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఇబ్బందులు లు రాకుండ పివోలు ఏపిఓలు, పోలింగ్ సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీస్కోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిసీ ఖాధర్ మొహియుద్దీన్, మాస్టర్ ట్రైనర్లు అమరేంధర్, సంపత్ పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.