50 వ డివిజన్లో ఇంటింటా విస్తృత ప్రచారం చేపట్టిన బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బోయినపల్లి ప్రవీణ్ రావు…
కరీంనగర్ కరీంనగర్ పట్టణం 50 వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బోయినపల్లి ప్రవీణ్ రావు ఆదివారం రోజున ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ 2014 లో...

కరీంనగర్
కరీంనగర్ పట్టణం 50 వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బోయినపల్లి ప్రవీణ్ రావు ఆదివారం రోజున ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ 2014 లో కేంద్రంలోఅధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందని, గత 11 ఏళ్లుగా కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం వందల కోట్ల నిధులను కేటాయించిందన్నారు. నిధుల కేటాయింపు కోసం కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంతో కృషి చేశారన్నారు. కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసంమోడీ ప్రభుత్వం కేటాయించిన నిధుల గురించి గ్రహించి, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి అండగా నిలవాలని కోరారు.కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం, నగర రూపురేఖలు మార్చడానికి ప్రయత్నించింది మాత్రం కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వమనేది నగ్న సత్యమన్నారు.కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు నాడు బీఆర్ఎస్ చేతిలో ఉన్న , బిజెపి అధికారం లో లేకపోయినా కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసమే నిరంతరం ఆలోచన చేసిందనీ, ఆ దిశగానే వందల కోట్ల నిధులతో కరీంనగర్ అభివృద్ధి కోసం కృషి చేసిన బీజేపీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ , కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ సహాయ సహకారాలతో పట్టణం, 50 వ మరింత శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
No Comment! Be the first one.