మూడు కర్తవ్యాలే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్….
కరీంనగర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ , సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, ప్రజలందరి ఆకాంక్షల్ని నెరవేర్చడం లాంటి మూడు కర్తవ్యాలే లక్ష్యంగా చారిత్రకమైన బడ్జెట్ ను...

కరీంనగర్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ , సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, ప్రజలందరి ఆకాంక్షల్ని నెరవేర్చడం లాంటి మూడు కర్తవ్యాలే లక్ష్యంగా చారిత్రకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బిజెపి జిల్లా అధ్యక్షుడి గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ గంగాడి కృష్ణారెడ్డి ఆదివారం రోజున మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా , ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా, భారత ఆర్థిక ప్రయాణం స్థిరంగా స్థిరంగా కొనసాగించే విధంగా అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. బడ్జెట్ ప్రధానంగా ఉపాధి కల్పన, మధ్యతరగతికి ఊరట, టెక్నాలజీ అభివృద్ధి పై దృష్టి సారించిందన్నారు. ఆదాయపు పన్ను, వ్యక్తిగత ఆర్థిక అంశాలు, వేతన జీవులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పన్ను విధానంలో మరిన్ని మార్పులు చేయడం శుభపరిణామన్నారు. ఉపాధి, నైపుణ్య అభివృద్ధి నిరుద్యోగతను తగ్గించేందుకు ప్రభుత్వం ఐదు ప్రధాన పథకాలను బడ్జెట్లో ప్రకటించడం హర్షనీయమన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, డిజిటల్ అగ్రికల్చర్ వచ్చే మూడేళ్లలో 6 కోట్ల మంది రైతులకు డిజిటల్ పద్ధతిలో భూమి వివరాలు, పంటల నమోదు కల్పించడం, కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా ప్రోత్సకాలు అందించడం , నూనె గింజల సాగును పెంచేందుకు ఆత్మనిర్బర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ బలోపేతం లాంటి చర్యలు వ్యవసాయ రంగానికి నూతన ఉత్తేజం ఇచ్చేలా ఉన్నాయన్నారు. బడ్జెట్ కేటాయింపుల పట్ల బిజెపి జిల్లా శాఖ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
No Comment! Be the first one.