నిరుద్యోగ సమస్య ,ఆర్థిక అంతరాలను తొలగించడానికి పరిష్కారం చూపని కేంద్ర బడ్జెట్. –సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.
కరీంనగర్ నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించకుండా, పేదలకు ధనికులకు మధ్య అంతరాలను తొలగించడానికి మార్గం చూపకుండా కేంద్ర బడ్జెట్ ఉందని సిపిఐ...

కరీంనగర్
నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించకుండా, పేదలకు ధనికులకు మధ్య అంతరాలను తొలగించడానికి మార్గం చూపకుండా కేంద్ర బడ్జెట్ ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తుంటే పేదలు మరింత పేదలుగా ధనవంతులు మరింత ధనవంతులుగా ఎదగడానికి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఉందని,బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలను తీవ్ర నిరాశ పరిచిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు హామీలు గానే మిగిలిపోతున్నాయని రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా బిజెపి ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చడం లేదని, తెలంగాణలోని ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదని, పేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఏమాత్రం చొరవచూపడం లేదని ఆ దిశగా బడ్జెట్ లేదని, కార్పోరేట్స్కే అనుకూలంగా ఉన్నదని శ్రీనివాస్ అన్నారు అన్నారు.
ఇప్పటికే రుణాలు, ఆర్థిక భారాలతో పేదలు సతమతమవుతున్నారని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి జిరామ్జి పథకం గా మార్చి, రాష్ట్రాలకు 40 శాతం భారాన్ని మోపరన్నారు. కేంద్రానికి చెల్లించే పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు.
రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపడం పట్ల రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపిలు ప్రజలకు సమాధానం చెప్పాలని పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
No Comment! Be the first one.