వైభవం గా, సంప్రదాయబద్దంగా..వన జాతర* *పోరాటం, త్యాగం,నమ్మకాల సమ్మిలితామే మేడారం జాతర* *వనం లోకి వన దేవత లు*
ములుగు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ లు గద్దెలను శనివారం 7.గంటల 55నిమిషాలకు వీడి వన...

ములుగు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026 భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ముగిసింది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ లు గద్దెలను శనివారం 7.గంటల 55నిమిషాలకు వీడి వన ప్రవేశం చేయడంతో ఈ జాతర పరిసమాప్తమైంది.వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య, ఉద్విగ్న వాతావరణంలో అమ్మవార్లు చిలకలగుట్టకు, కన్నెపల్లికి, పయనమయ్యారు. భక్తులు అమ్మవార్లకు “వన దేవతలు వనం లోకి” అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు.2026 జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా….మధ్యప్రదేశ్, చ త్తి స్ ఘడ్, ఒడిశా ఇలా దేశ నలుమూలల నుండి జాతర కి విచ్చేసి…అమ్మలకు మొక్కులు చెల్లించుకుని…. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.
No Comment! Be the first one.