ప్రజావాణి కార్యక్రమం రద్దు* — *కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల...

కరీంనగర్
కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు.
No Comment! Be the first one.