మరణంలోనూ వీడని స్నేహం… రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి*
జనగామ జిల్లా: ప్రాణ స్నేహం మరణానికీ దాటని విషాద ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన గన్న ఆనంద్ మరియు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన రాకేష్ రోడ్డు...

జనగామ జిల్లా:
ప్రాణ స్నేహం మరణానికీ దాటని విషాద ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన గన్న ఆనంద్ మరియు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన రాకేష్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
రాకేష్ అమ్మమ్మ ఊరు శాతపురం కావడంతో చిన్ననాటి నుంచే అక్కడే పెరిగి, ఆనంద్‌తో గాఢమైన స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆనంద్ పుట్టినరోజు నిన్న కావడంతో స్వగ్రామానికి వచ్చి, అనంతరం కారులో సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లి పుట్టినరోజు జరుపుకున్నారు.
తిరిగి గ్రామానికి చేరుకున్న అనంతరం కారు అక్కడే వదిలి, బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో భువనగిరి బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో బైక్ అదుపు తప్పి ఇద్దరూ బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరు యువకుల మృతితో శాతపురం, తిరుమలగిరి గ్రామాలు విషాదఛాయలతో అలముకున్నాయి. పోస్టుమార్టం గది వద్ద ఇరువురి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఒక్కసారిగా ఆస్పత్రి ప్రాంగణం శోకసముద్రంగా మారింది.
ప్రాణ స్నేహితులైన యువకులు ఒకే ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడున్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
No Comment! Be the first one.