కరీంనగర్లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంపాటు విశేష సేవలందించిన ఐదుగురు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం శనివారంనాడు కరీంనగర్ కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది....

కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలంపాటు విశేష సేవలందించిన ఐదుగురు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం శనివారంనాడు కరీంనగర్ కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. కరీంనగర్ పోలీసు కమీషనరేటు కార్యాలయం నుండి ఏవో వై.వి. మునిరామయ్య, మహిళా పోలీసు స్టేషన్ నుండి ఎస్సై చల్ల రాజన్న, ట్రాఫిక్ పి.ఎస్. నుండి మహమ్మద్ ముస్తఫా, ఏ.ఆర్. పోలీస్ హెడ్ క్వార్టర్స్ విభాగం నుండి, ఏఆర్ ఎస్సైలు ఖలీల్ , మహమ్మద్ బాషు పదవీ విరమణ పొందారు.
కరీంనగర్ అడిషనల్ డీసీపీ పరిపాలన వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ, అనేక సవాళ్లతో కూడుకున్న పోలీస్ ఉద్యోగాన్ని విజయవంతంగా, నిబద్ధతతో పూర్తి చేసి పదవీ విరమణ పొందడం ఒక గొప్ప విజయమని కొనియాడారు. అధికారులు అందించిన సేవలకు వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని, ఆ సహకారం వల్లే వారు సమర్థవంతంగా పనిచేయగలిగారని గుర్తు చేశారు. పదవీ విరమణ తర్వాత అధికారులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
అడిషనల్ డీసీపీ స్వయంగా పదవీ విరమణ పొందిన ఇరువురికి పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. వారికి జ్ఞాపికలను అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లు వెంకటరమణ , సిఎస్బి ఏసీపీ శ్రీనివాస్ , సిఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రిజర్వు ఇన్స్పెక్టర్ అడ్మిన్ రజినీకాంత్, కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై శ్రీ మామిడి సురేందర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.