బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు*
కరీంనగర్ 42వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖలీద్ ఆలీ వారి అనుచరులు 20 మందితో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వీరికి...

కరీంనగర్
42వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖలీద్ ఆలీ వారి అనుచరులు 20 మందితో కలిసి మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వీరికి ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖలీద్ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నాయకత్వంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని.. ఈ రెండేళ్ల కాంగ్రెస్ , బిజెపి ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని. కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతుందని .. మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే నివాసంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, నాయకులు నందెల్లి మహిపాల్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మైనార్టీ పట్టణ యువత అధ్యక్షులు నవాజ్ హుస్సేన్, నాయకులు సుధాకర్ రావు, ఎండి గౌసుద్దీన్, సిద్ధిక్, సోయబ్ , కబీర్ ఖాన్, ఇర్ఫాన్, సైఫ్, ఫరూక్, అయూబ్, అంజద్, అఫ్జల్ తదితరులు ఉన్నారు.
No Comment! Be the first one.