ఎంఐఎం పార్టీకి భారీ షాక్*
కరీంనగర్ 37వ డివిజన్ ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ షర్ఫుద్దీన్ వారి అనుచరులతో కలసి ఎంఐఎం పార్టీని వదిలి గురువారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో...

కరీంనగర్
37వ డివిజన్ ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ షర్ఫుద్దీన్ వారి అనుచరులతో కలసి ఎంఐఎం పార్టీని వదిలి గురువారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గంగుల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగింది. ఎమ్మెల్యే గంగుల వెంట బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, తో పాటు.. మహ్మద్ ఫిరోజ్, మహమ్మద్ మోయిజ్ , అప్రోజ్ , పలురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.