బాలసదనం, రక్తసంబంధీకులనుండి పిల్లల దత్తత ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్
కరీంనగర్ కరీంనగర్ బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న ఏడు సంవత్సరాల బాలికను హైదరాబాద్ కు చెందిన పిల్లల్ని దంపతులు దత్తత తీసుకున్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలోని గోపాల్ పూర్ కు చెందిన పిల్లలు లేని దంపతులు...

కరీంనగర్
కరీంనగర్ బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న ఏడు సంవత్సరాల బాలికను హైదరాబాద్ కు చెందిన పిల్లల్ని దంపతులు దత్తత తీసుకున్నారు. కరీంనగర్ అర్బన్ పరిధిలోని గోపాల్ పూర్ కు చెందిన పిల్లలు లేని దంపతులు వారి సమీప బంధువుల నుండి 13 సంవత్సరాల బాబును దత్తత తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా ఈ దత్తత కార్యక్రమం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలనుకునే వారు, బాల సదనాల నుండి దత్తత కోరుకునేవారు జిల్లా పరిషత్ లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సరస్వతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దుర్ధాన పర్వీన్, సిడబ్ల్యుసి మెంబర్లు కళింగ శేఖర్, విజయ్ కుమార్, ఎల్.పి.ఓ రాజు, మిషన్ వాత్సల్య సిబ్బంది తిరుపతి, సాధినేని రమేష్, కవిత, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
No Comment! Be the first one.