జాతర సందర్భంగా జనవరి 30న సెలవు
మేడారం : శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా జనవరి 30, 2026 (శుక్రవారం) ములుగు జిల్లాలో స్థానిక సెలవుగా ప్రకటించారు. మేడారం గ్రామంలో జరిగే జాతరలో గద్దెలపై దేవతలు కొలువూ ఉండటం, భక్తుల...

మేడారం :
శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా జనవరి 30, 2026 (శుక్రవారం) ములుగు జిల్లాలో స్థానిక సెలవుగా ప్రకటించారు. మేడారం గ్రామంలో జరిగే జాతరలో గద్దెలపై దేవతలు కొలువూ ఉండటం, భక్తుల పెద్ద సంఖ్యలో రాకపోకలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ దివాకర టి.ఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలకు వర్తిస్తుందని తెలిపారు. జనవరి 30న సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14, 2026 (రెండో శనివారం)ను వర్కింగ్ డే గా ఉంటుందని తెలిపారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లోకల్ హాలీ డే ప్రకటించే వారు.. కానీ ఇప్పుడు కేవలం ములుగు జిల్లా కే పరిమితం చేయడంపై సర్వత్రా నిరాశ చెందుతున్నారు.
No Comment! Be the first one.