జాతర తేదీల్లో నామినేషన్ల కుట్ర –కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలు బొమ్మ గా ఎన్నికల కమిషన్? – > మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీచైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు.
కరీంనగర్ ; కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్...

కరీంనగర్ ; కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మీడియా సమావేశంలో సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ…రాష్ట్ర ఎన్నికల కమిషన్ , చీఫ్ సెక్రెటరీ గార్లను మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అడవి తల్లీ బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం అన్యాయమని ప్రభుత్వ నిర్ణయం గిరిజనులపై చిన్నచూపేనని సర్ధార్ రవీందర్ సింగ్ అభివర్ణించారు.రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన మహా కుంభమేళా అయిన సమ్మక్క-సారలక్క జాతరకు దాదాపు ఐదు రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎవరి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు ? మతసామరస్యాలు కాపాడాల్సిన బాధ్యత లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి రెండేండ్లకు ఒకసారి వచ్చే మేడారం కుంభమేళను దర్శించుకోవడానికి లక్షలాదిగా జనం తరలిపోతున్నారు … ఎక్కడ చూసినా సమ్మక్క సారక్క తల్లులకు బంగారంతో మొక్కలు చెల్లించుకున్నారనీ … ముందుగానే ప్రకటించిన మేడారం తల్లుల జాతర గమనించకుండా .. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తదుపరి తేదీలలో ప్రక్రియ పూర్తి చేయాలని తెలియదా ? అంటూ ప్రశ్నించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ కొమ్ము కాస్తుందనీ … ఎన్నికల షెడ్యూల్ తేదీలోనీ ప్రక్రియను ఎవరి కోరిక మేరకు విడుదల చేశారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.జాతర జరిగే రోజుల్లోనే నామినేషన్లు వేసేలా ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా జాతరలో ఉంటే నామినేషన్లు ఎలా వేయగలరని, జాతర ముగిసిన తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… లేకుంటే కక్షపూరితంగా నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు.2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సోయి లేదా అంటూ ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని … రాజ్యాంగానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని … ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.గిరిజన బిడ్డలు , షెడ్యూల్ కులాలు బడుగుబలహీన వర్గాలు ఎవ్వరూ పోటీ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కయ్యారని సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు.మహా జాతర సమయంలో ప్రతి ఒక్కరూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారని … ఇలాంటి వాతావరణంలో ప్రజలను ఇబ్బంది పెట్టి అభ్యర్థులను పోటీ చేయకుండా దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రాబోయే జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను పండుగల సమయంలో నిర్వహించవద్దని కోరారు. ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని…. చట్టం రాజ్యాంగ పై నమ్మకాల ప్రభావం చూపుతుందని … ప్రతిఒక్కరికి పోటీ చేసే హక్కు కల్పించాలని పేర్కొన్నారు.మేడారం మహా జాతర జరిగే తేదీల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం సరికాదని సర్ధార్ రవీందర్ సింగ్ తెలిపారు.
No Comment! Be the first one.