నగర అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి.–మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
కరీంనగర్ కరీంనగర్ నగరంలోని ఐదవ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం రోజున ప్రారంభించి ..రాబోవు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఐదవ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదె రూప- శ్రీనివాస్ లను భారీ...

కరీంనగర్
కరీంనగర్ నగరంలోని ఐదవ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం రోజున ప్రారంభించి ..రాబోవు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఐదవ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదె రూప- శ్రీనివాస్ లను భారీ మెజారిటీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను వారు కోరారు. పార్టీ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు ఐదవ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదే రూప- శ్రీనివాస్ లతోపాటు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. మొదటగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వారు. అనంతరం డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని.. రాబోవు రోజుల్లో నగరాన్ని అభివృద్ధి చేసేది కూడా బిఆర్ఎస్ పార్టీయే అన్నారు.ఈ రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి రెండు రూపాయల కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో దుర్షేడ్,గోపాలపూర్, బొమ్మకల్ ఈ ఐదు ఆరు ఏడు డివిజన్లకు సంబంధించి మెజార్టీ ఇచ్చారని… ప్రస్తుత ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు.. ఐదవ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదే రూప- శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, కరీంనగర్ రూరల్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, డివిజన్ నాయకులు సుంకిశాల సంపత్ రావు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, నాయకులు వెంగల్ దాస్ శ్రీనివాస్, తోట కిరణ్, కాల్వ అశోక్, గోనె నరసయ్య, శ్రీకాంత్, కిరణ్ కుమార్, ఈశ్వర్, లచ్చన్న, సందీప్, అజయ్ గౌడ్, సాయి, కృష్ణ, నాగరాజు, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.