షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారు చాలా జాగ్రత్త
షేర్ మార్కెట్ అనేది లాభాల క్షణం – నష్టాల క్షణం. ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చగలదు… అదే నిర్ణయం జీవితాన్ని కుదిపేయగలదు కూడా. ప్రత్యేకంగా కమోడిటీస్ & మెటల్స్ ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చే వాళ్లు ఇంకా...

షేర్ మార్కెట్ అనేది లాభాల క్షణం – నష్టాల క్షణం.
ఒక్క నిర్ణయం జీవితాన్ని మార్చగలదు…
అదే నిర్ణయం జీవితాన్ని కుదిపేయగలదు కూడా.
ప్రత్యేకంగా కమోడిటీస్ & మెటల్స్ ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చే వాళ్లు ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి.
బంగారం –స్థిరత్వానికి గుర్తు
బంగారం ధర సాధారణంగా ఎక్కువగా ఊగిసలాడదు మరియు దీర్ఘకాలంలో నమ్మకమైన రిటర్న్స్ ఇస్తుంది. ఇన్ఫ్లేషన్కు రక్షణగా పనిచేస్తుంది.అందుకే Gold ETF లో ఫ్లక్చువేషన్స్ తక్కువ – రిస్క్ కూడా తక్కువ#వెండి (Silver) – లాభాలే కాదు, నష్టాలూ అదే వేగం
ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ మరియు గ్లోబల్ న్యూస్‌కి వెంటనే రియాక్షన్
చిన్న చిన్న వార్తకే పెద్ద ఊగిసలాట
👉 ఓపిక ఉంటే → అద్భుతమైన లాభాలు
👉 ఓపిక లేకుంటే → క్షణాల్లో కరిగిపోయే పెట్టుబడి
గత_గురువారం ఒకేసారి:Silver ETF లో భారీ మార్పులు
Gold ETF తో పోలిస్తే చాలా ఎక్కువ వోలాటిలిటీ
ఎంతో మంది లాభాల్లో ఉన్నవాళ్ల లాభాలు క్షణాల్లోనే ఆవిరిఅయ్యాయి.ఇది ఒక్క రోజులో జరిగిపోయింది…
ఇదే మార్కెట్ నిజం. కేవలం బంగారం – వెండితోనే ఆగిపోవద్దు
Dont_keep_all_eggs_in_one_basket అనే సూత్రాన్ని ఎప్పుడు విస్మరించవద్దు
Gold & Silver మాత్రమే చాలు… అనేది ఎప్పుడు సేఫ్ కాదు సేఫ్ అనేది డైవర్సిఫికేషన్‌లో ఉంటుంది
ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో తప్పకుండ ఉండవల్సిన ఇతర మెటల్స్:
#కాపర్ (Copper)
ఎలక్ట్రిక్ వాహనాలు,ఇన్ఫ్రాస్ట్రక్చర్,పవర్ రంగం
#భవిష్యత్తు డిమాండ్ బలంగా ఉంటుంది
#జింక్ (Zinc)
స్టీల్ ఇండస్ట్రీ,గాల్వనైజేషన్
సైక్లికల్ అయినా మంచి అవకాశాలు
#అల్యూమినియం (Aluminium)
ఆటోమొబైల్,ఏవియేషన్,ప్యాకేజింగ్
తక్కువ బరువు – ఎక్కువ డిమాండ్
గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం
ఒక్క ఆస్తిపై ఆధారపడొద్దు
లాభం వచ్చినప్పుడు బుక్ చేయడం నేర్చుకోండి
ఓపిక + అవగాహన = నిజమైన ఇన్వెస్టర్
భావోద్వేగాలతో కాదు… గణాంకాలతో నిర్ణయం తీసుకోండి
షేర్ మార్కెట్ ఎప్పుడు కూడా
#ఆశలను_నెరవేర్చుతుంది_అతి_ఆశను_శిక్షిస్తుంది అందుకే
ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆలోచించండి…
పెట్టిన తర్వాత ఓపిక పట్టండి…
లాభం వచ్చినప్పుడు లోభపడకండి.
నన్ను ఏమి కొనాలి అని అడగకండి, నాకు తెలిసిన విషయం నేను పంచుకున్నాను market ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు, అంతర్జాతీయ నాయకులు మాట్లాడే ఒక్క మాట కూడా మార్కెట్ లాభాలు ఇవ్వడానికి, నష్టాలతో ముగించడానికి అవకాశం ఉంది కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే వారు చాలా జాగ్రత్త గా వ్యవహరించండి
చాలా ముఖ్య విషయం
సోషల్ మీడియా ఛానెల్స్ లో చెప్పే apps డౌన్లోడ్ చేసి దయచేసి ట్రేడింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి.
No Comment! Be the first one.