కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బొమ్మకల్ ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం.. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం.. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బొమ్మకల్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ...

కరీంనగర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బొమ్మకల్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కోరారు. మంగళవారం రాత్రి కరీంనగర్ లోని 6 వ డివిజన్ బొమ్మకల్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమం.. భారీ ర్యాలీలో రాజేందర్ రావు పాల్గొన్నారు. అనంతరం ప్రజల ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బొమ్మకల్ అభివృద్ధికి పాటుపడతామని అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బొమ్మకల్ ప్రజలు ఆశీర్వదించాలని ఆదరించాలని కోరారు. బొమ్మకల్ లో వైకుంఠధామం అభివృద్ధికి కృషి చేస్తామని ఇతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. బొమ్మకల్ ను అప్గ్రేడ్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వము ద్వారా నిధులు మంజూరు చేయించి మోడల్ డివిజన్ గా తీర్చి దిద్దుతామని రాజేందర్రావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని రాజేందర్ రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఏ ఇతర పార్టీలతో సాధ్యం కాదని స్పష్టం చేశారు. తామంతా చిత్త శుద్ధితో ప్రజలకు అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని రాజేంద్ర రావు పేర్కొన్నారు. అంతకుముందు డివిజన్ పార్టీ కార్యాలయాన్ని రాజేందర్ రావు కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కరాంరెడ్డి మిడిదొడ్డి కపిల మాధవ్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ ప్రజలు ప్రతినిధులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No Comment! Be the first one.