సింగరేణి కుంభకోణాన్ని సిబిఐకి, సిట్ కు అప్పగించాలి– కేటీఆర్,-గవర్నర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ పూర్తి*
హైదరాబాద్ గవర్నర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ పూర్తి., సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి...

హైదరాబాద్
గవర్నర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ పూర్తి., సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
రేవంత్ రెడ్డి అతని సోదరులు కలిసి హిల్ట్ స్కాంతో హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని రూ.5 లక్షల కోట్ల విలువైన 9200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.రేవంత్ రెడ్డి తన సోదరుల దోపిడి సరిపోక ఇప్పుడు బావమరిది కళ్ళల్లో ఆనందం చూడటానికి సింగరేణిని గుత్తకు రాసిచ్చిండు., ఈ సింగరేణి కుంభకోణాన్ని సీబీఐకు లేదా సిట్‌కు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని గవర్నర్ గారిని కోరినం.,తెలంగాణలో సీఎం అంటే కోల్ మాఫియా అని సింగరేణి కార్మికులు, ప్రజలు అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది.,ఈ కుంభకోణంపై మేము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఒక్క సమాధానం రాలేదు.,దీనిపై స్పందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచులు ఆడుతూ, విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నా అని పోజులు కొడుతున్నాడు .,సింగరేణి నిధులు రూ.10 కోట్లు రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి దుర్వినియోగం చేసి అన్యాయం చేశాడు.
No Comment! Be the first one.