మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి.. –కాంగ్రెస్ ప్రభుత్వం తోనే కరీంనగర్ అభివృద్ధి.. –కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు —31 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. భారీ ర్యాలీ..
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు....

కరీంనగర్
కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాలుగా మైనార్టీలకు ప్రత్యేక అనుబంధం సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఎన్నికల్లోను కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్నారని చెప్పారు.మంగళవారం కరీంనగర్ లోని 31 డివిజన్ ఖాన్ పూరాలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని రాజేందర్ రావు ప్రారంభించారు. అంతకుముందు భారీ ర్యాలీతో రాజేందర్రావు తరలివచ్చారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ నాయకులు మైనార్టీ నాయకులు, సోదరులు మహిళలు ప్రజలు రాజేంద్ర రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్ రావు మాట్లాడుతూ కరీంనగర్లో అత్యధిక జనాభా ముస్లిం మైనార్టీ లేదేననీ, మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మా తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావుకు మైనార్టీ సోదరులు అంటే ఎంతో ఆత్మీయత అభిమానం ఉండేదని గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమానికి జగపతిరావు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పటికి జగపతిరావుపై అభిమానం అలాగే ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ బిజెపికి ఓట్లు వేయడం వృధా అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న బిజెపి గల్లీలో సమస్యలు పరిష్కరించదన్నారు. గల్లీలో సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని రోడ్లు పారిశుద్ధ్యము డ్రైనేజీ తాగునీరు పోలీసు రెవెన్యూపరంగా ఏ పనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిపెడుతుందని చెప్పారు. కరీంనగర్ మైనార్టీ సోదరులు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో మైనార్టీలు కరీంనగర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. తాను కరీంనగర్ మైనార్టీ సోదరులకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అర్ధరాత్రి అపరాత్రి అండగా ఉంటానని ఏ ఆపద వచ్చినా వెన్నుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక బృహత్తర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రెహమాన్ ఖాదీర్శఖాన్ జాఫర్ హాజీ రజాక్ జియా తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు 31 వ డివిజన్ నాయకులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No Comment! Be the first one.