రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్‌కు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
కరీంనగర్: మంగళవారం రోజున కరీంనగర్ నగరంలోని తొమ్మిదవ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ మహిళలు మంగళ...


కరీంనగర్:
మంగళవారం రోజున కరీంనగర్ నగరంలోని తొమ్మిదవ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కోతి బొమ్మ చౌరస్తా నుంచి, డివిజన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జై కేసీఆర్.. జై బిఆర్ఎస్.. కారు గుర్తుకు ఓటేద్దామంటూ ..నినాదాలు చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించి స్థానికుల ఉద్దేశించి ఎమ్మెల్యే గంగుల మాట్లాడారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీ ప్రభుత్వాల పాలనలో తెలంగాణ రాష్ట్రం నలబై, యాబై ఏళ్లు దరిద్రాన్ని అనుభవించిందన్నారు. ఈ రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగరానికి రెండు రూపాయల కూడా తీసుక రాలేదని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన నిధులతో అభివృద్ధి చేస్తూ తామే ఆ నిధులు తీసుకువచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఫోటోలు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో.. రెండేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విధ్వంసం ఏంటో విజ్ఞులైన ప్రజలు గమనించాలనీ కోరారు.కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓటేస్తే మళ్లీ 50 ఏళ్లు దరిద్రానికి స్వాగతం పలికనట్టు అవుతుందన్నారు.బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీకి ముఖ్యమన్నారు. మన పిల్లలు ఉన్నతంగా ఉండాలన్న.. నగరం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నా బిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని ప్రజలను కోరారు.అబద్దాల హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని విమర్శించారు. కల్యాణ లక్ష్మి పథకం పైన తులం బంగారం, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్, ఆడబిడ్డలకు స్కూటీ తో పాటు 2500 రూపాయల భృతి ఇలా ఎన్నో దొంగ హామీలను ఇచ్చి ప్రజలకు ఆశ కల్పించి.. గద్దెనెక్కి ప్రజలకు చేసిన హామీలను మరిచిపోయి నిరంకుశ పాలన కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ రెండేళ్ల కాలంలో చేయని అభివృద్ధి మూడేళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు .
కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం
బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని.. మళ్లీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బిఆర్ఎస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి లత – ఐలెందేర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మర్రి భావన- సతీష్, దిండిగాల మహేష్, గందె మాధవి- మహేష్, నలువాల రవీందర్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్, మీడిదొడ్డి నవీన్, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.