సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ‼️* – నైనీ కోల్ మైన్ వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి – మెస్సి ఆటకు , రాజీవ్ అభయ హస్తం పేరిట సర్కార్ నిధులు దుర్వినియోగం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు , కేటీఆర్ ఫిర్యాదుతో కదిలిన డొంక – ఇప్పటికే వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశం
హైదరాబాద్ : సింగరేణి నైనీ కోల్ మైన్ టెండర్ల రద్దు, అక్రమాల వివాదంలో విచారణ జరుపాలని ద్విసభ్య కమిటీని నియమించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ..అనూహ్యంగా అదే ఉత్తర్వులలో సీఎం రేవంత్...

హైదరాబాద్ : సింగరేణి నైనీ కోల్ మైన్ టెండర్ల రద్దు, అక్రమాల వివాదంలో విచారణ జరుపాలని ద్విసభ్య కమిటీని నియమించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ..అనూహ్యంగా అదే ఉత్తర్వులలో సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఒకవైపు కోల్ మైన్ టెండర్ల దందాలపై విచారణ జరపమని ఆదేశించిన కేంద్రం..సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్ బాల్ ఈవెంట్ కోసం సింగరేణి సీఎస్ఆర్( CSR) నిధులను వినియోగించడాన్ని దుర్వినియోగంగా పరిగణించి ఈ వ్యవహారంపై కూడా విచారణ చేయాలని ద్విసభ్య కమిటీకి సూచించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల మెస్సీ ఫుట్ బాల్ ఈవెంట్ నిర్వహణ కోసం రూ. 10 కోట్ల సింగరేణి నిధులను ఖర్చు చేశారు. ఇదే కాకుంగా మరికొన్ని ప్రభుత్వ స్కీమ్ ల పేరుతో చేపట్టిన కార్యక్రమాల కోసం సింగరేణి సీఎస్ఆర్ ఫండ్స్ నిధుల దుర్వినియోగం జరిగిందనే కారణంతో వాటిపై కూడా విచారణ చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం విచారణ కమిటీని ఆదేశించడం గమనార్హం. ద్విసభ్య విచారణ కమిటీలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు.
No Comment! Be the first one.