రౌడీషీట్ తెరిస్తే ఆరు నెలలకోసారి సమీక్ష తప్పనిసరి – హైకోర్టు
హైదరాబాద్ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తులపై రౌడీషీట్ తెరిస్తే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిరంతరాయంగా రౌడీషీట్...

హైదరాబాద్ :
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వ్యక్తులపై రౌడీషీట్ తెరిస్తే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిరంతరాయంగా రౌడీషీట్ కొనసాగించడం చెల్లదని జస్టిస్ ఎన్. తుకారాంజీ తీర్పు వెలువరించారు. 2008లో నమోదు చేసిన రౌడీషీట్‌ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ ఖలీద్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. పిటిషనర్‌పై కేసులు లేకపోయినా రౌడీషీట్ కొనసాగించడం అన్యాయమని న్యాయవాది వాదించగా, ఏడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే, రౌడీషీట్ కొనసాగింపు చెల్లదని హైకోర్టు తేల్చి, పోలీసులు రికార్డుల్లో నమోదు చేయాలని, కొనసాగించాలో లేదో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
No Comment! Be the first one.