ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు* — *జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్*
కరీంనగర్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని...

కరీంనగర్ : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి.
*ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు*
రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. బాలబాలికలు అందరూ ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. జాతీయ సమైక్యతా భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. దివ్యాంగులకు సహాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు ఆఫీసులో, కరీంనగర్ క్లబ్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.
*కలెక్టరేట్లో..*
కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాళీ చరణ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
No Comment! Be the first one.