ఎలగందుల గ్రామానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తా.. –కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తాననీ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి...

కరీంనగర్
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తాననీ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ప్రజలకు అర్ధరాత్రి అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా ముందుండి సహాయమందిస్తానని 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఉపాదాన్ని పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్ రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు తీర్మానం చేసిన కాపీలను నమిండ్ల శ్రీనివాసు రాజేందర్రావుకు పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్రావు మాట్లాడుతూ నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు ఉపాధిమీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. నాడు రాష్ట్రంలో ఎవరు చేపట్టని విధంగా ధైర్యంగా సాహసంగా కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మా తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. టైగర్ జగపతిరావు తనయుడుగా తాను ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఎలగందుల గ్రామంలో రెండో విడత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పెద్ద సంఖ్యలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఏ ఆపద వచ్చిన ఎల్లవేళలా అండగా ఉంటానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మల అంజన్న ఉపసర్పంచ్ గసికంటి కుమారు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
No Comment! Be the first one.