పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తాం.. — కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు — వెలిచాల సమక్షంలో 100 మంది కాంగ్రెస్లో చేరిక..
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సోమవారం కొత్తపల్లి...

కరీంనగర్
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి తప్పకుండా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో 4 వ డివిజన్ గోపాల్ పూర్ దుర్షేడు నుంచి వందమంది వివిధ పార్టీల నుంచి వెలిచాల రాజేందర్రావు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేంద్ర రావు మాట్లాడుతూ ప్రజల్లో మంచి ఆదరణ పలుకుబడి తో పాటు సర్వే ఆధారంగా కార్పోరేటర్ టికెట్లు అధిష్టానం కేటాయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి రాబోయే రోజుల్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. గోపాల్ పూర్ దుర్షేడు నుంచి బెజ్జంకి శ్రీనివాస్ సాయిని శ్రీనివాస్ బెజ్జంకి సంపత్ సాయిని రాజిరెడ్డి సంధినేని కుమారు బెజ్జంకి సత్తయ్య గాజుల ఎల్లమ్మ తోపాటు వందమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గసికంటి కుమార్ అనంతుల రమేష్ వెలిచాల రాజేందర్రావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాసారపు కిరణ్ కుమార్ గండి గణేష్ బోనాల అశోక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
No Comment! Be the first one.