సైనికులు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి* — లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్
కరీంనగర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని సైనిక్ వెల్ఫేర్ భవన్ లో...

కరీంనగర్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని సైనిక్ వెల్ఫేర్ భవన్ లో *వీర్ పరివార్ సహాయతా యోజన* పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ మాట్లాడుతూ సైనిక్ వెల్ఫేర్ భవన్ లో పదవీ విరమణ పొందిన, అంగవైకల్యం పొందిన, మరియు ఉద్యోగంలో ఉన్న సైనికుల కుటుంబాలకు, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేకంగా న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా న్యాయ సహాయం కల్పిస్తున్నామని ఈ యొక్క న్యాయ సహాయ కేంద్రంలో ఒక న్యాయవాది మరియు ఒక పారా లీగల్ వాలంటీర్ సేవలందిస్తున్నారని తెలియజేశారు, ఆస్తికి సంబంధించి గాని, పెన్షన్ కి సంబంధించి గాని ఇతర ఏ చట్టపరమైన సమస్యల కైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయసహాయము అందిస్తుందని తెలియజేశారు, ఎటువంటి న్యాయ సలహా కైనా కూడా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ తో పాటు, పానెల్ న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, శాంతి కుమార్, అశ్విని సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి మోహన్, జనరల్ సెక్రెటరీ టి శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.