మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం
కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...

కరీంనగర్
మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ వాహనంలో స్వామివారు విహరించగా ఈ వేడుకల్లో మంత్రి, సుడా చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం మంత్రికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ మహేశ్వర్, ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో కందుల సుధాకర్ పాల్గొన్నారు.
No Comment! Be the first one.