డిప్యూటీ తాసిల్దార్ నుంచి ఐఏఎస్ వరకు… శ్యాం ప్రసాద్ లాల్ ఐఏఎస్‌కు టీఎన్జీవోల ఘన సన్మానం
కరీంనగర్ డిప్యూటీ తాసిల్దార్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగి, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) స్థాయి దాటి ప్రతిష్టాత్మక ఐఏఎస్ హోదా సాధించిన కరీంనగర్ జిల్లాకు...

కరీంనగర్
డిప్యూటీ తాసిల్దార్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగి, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) స్థాయి దాటి ప్రతిష్టాత్మక ఐఏఎస్ హోదా సాధించిన కరీంనగర్ జిల్లాకు గర్వకారణమైన అధికారి గాజుల శ్యాం ప్రసాద్ లాల్ ఐఏఎస్ గారు కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా, టీఎన్జీవో–టీజీవో ఆధ్వర్యంలో స్థానిక ఫిలిం భవన్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలలు, శాలువాలతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఉద్యోగ సంఘాల నాయకులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ— గాజుల శ్యాం ప్రసాద్ లాల్ గారు డిప్యూటీ తాసిల్దార్ నుంచి అంచలంచెలుగా ఎదిగి ఐఏఎస్ హోదా సాధించడం కరీంనగర్ జిల్లాకే గర్వకారణమని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆపద్బాంధవుడిగా, శ్రేయోభిలాషిగా సేవలందించిన ఆయన, ఉద్యోగులందరికీ ఒక ఐకాన్, లెజెండరీ నాయకుడుగా మారారని కొనియాడారు. ఎంత పెద్ద స్థాయికి చేరినా తన మూలాలను, తన జిల్లాను, కరీంనగర్ ఉద్యోగులను మరవకుండా “అందరివాడిలా” ఉంటూ అందరి మనసులు గెలుచుకున్నారని ప్రశంసించారు .ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాస్ రెడ్డి సంఘం లక్ష్మణరావు, మడిపల్లి కాళీ చరణ్, ముప్పిడి కిరణ్ కుమార్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, గంగారపు రమేష్, ఒంటెల రవీందర్ రెడ్డి, సందీప్ రావు, నాగుల అనిల్, పూర్ణచందర్ రెడ్డి, సత్యం, కొండల్ రెడ్డి, రామ్మోహన్, సత్యం శీను మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసన్న,రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు వెంకట్‌రెడ్డి, విజయ్ పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.