మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రజాప్రతినిధుల ప్రమేయం లేదు —రాష్ట్ర బిసి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ కరీంనగర్ మార్కెట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథ సప్తమి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర బిసి, రవాణాశాఖ మంత్రి...

కరీంనగర్
కరీంనగర్ మార్కెట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథ సప్తమి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర బిసి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్,ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. ఈ సంధర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారని, ఇప్పుడు కూడా అలా జరుగుతుందని భావిస్తున్నారని, అలాంటి పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో కూడా అలాంటి ప్రమేయం ఉందని, రిజర్వేషన్ ల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల సహా ఎవరి ప్రమేయం ఉండదని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, సెలెక్ట్ ఎలెక్ట్ ఎంపిక ద్వారా జరుగుతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. కరీంనగర్ పాత మార్కెట్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి 9 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో మాజీ మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. రాజకీయాలు అతీతంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం,దాతలు పూజ కార్యక్రమాలు ,హోమాలు , అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర 28-31 మధ్య ఉన్నందున ఈ యాత్ర ఇక్కడ ఒకటో తారీకు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ రవాణా శాఖ తరుపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉత్తర తెలంగాణ లోని కరీంనగర్ , వరంగల్ , నిజామాబాద్ ,ఆదిలాబాద్ లోని 51 కేంద్రాల నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఆర్టీసీ 4 వేల ఆర్టీసీ బస్సులు నడుపుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం బద్రత అధికంగా ఉంటుందని, జాతర కి వెళ్ళే భక్తులు ఆర్టీసీ లో ప్రయాణం చేయాలని కోరారు. ఆర్టీసీ బస్సులు గద్దెల వరకు వెళ్లే అవకాశం కల్పించిందని చెప్పారు. జాతర కి వచ్చే పిల్లలు తప్పిపోకుండా ఉండడానికి పోలీస్ శాఖ క్యూ ఆర్ కోడ్ తీసుకొచ్చిందని, అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ పై మా ప్రభుత్వం ఎవరిపై కక్ష పూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
No Comment! Be the first one.