ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురు స్పాట్ డెడ్
గుజరాత్ గుజరాత్ బనాస్కాంతా బనాస్కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమీర్‌గఢ్ తాలూకా ఇక్బాల్‌గఢ్ సమీపంలోని పాలన్పూర్...

గుజరాత్
గుజరాత్ బనాస్కాంతా బనాస్కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమీర్‌గఢ్ తాలూకా ఇక్బాల్‌గఢ్ సమీపంలోని పాలన్పూర్ – అబు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.. అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను పాలన్పూర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో ఇన్నోవా కారులో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు
No Comment! Be the first one.