బడ్జెట్ సమావేశాల్లో జమిలి బిల్లు!
త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో.. జమిలి ఎన్నికలపై బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ...
త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో.. జమిలి ఎన్నికలపై బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ...

త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో.. జమిలి ఎన్నికలపై బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ సమావేశాల్లోనే సమర్పించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. జమిలి ఎన్నికలతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మరో అంశం.. నియోజకవర్గాల పునర్విభజన. దీనికి సంబంధించి బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతోందని, బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెడతారని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశాల మొదటి రోజే జరగనున్న కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పూర్వోదయ పథకం కింద ఏపీకి భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Our site uses cookies. By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
No Comment! Be the first one.