ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు: మంత్రి జూపల్లి
ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ...

ఫోన్‌ట్యాపింగ్ కేసులో దోషులను కఠినంగా శిక్షపడేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమని.. దానిని రాజకీయ కక్ష్య అని అనడం సరికాదని ఆయన అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌లో పాత్రధారులెవరో, సూత్రధారులెవరో తెలియాల్సి ఉందన్న మంత్రి.. దీనిని దిగజారుడు తనమే అంటారని చెప్పుకొచ్చారు. ప్రజాధనంతో నడిచేది విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? దర్యాప్తు జరిపించవద్దా.? అని ప్రశ్నించారాయన.
No Comment! Be the first one.