ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్...

కరీంనగర్
ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ , అధికారులు, కార్యాలయ ఉద్యోగులతో కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
No Comment! Be the first one.