సింహం గుర్తు కోసం పోటీ పడుతున్న ఆశవహులు — ఏ ఐ ఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
కరీంనగర్ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా...

కరీంనగర్
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంచిర్యాల చౌరస్తా నుండి నేతాజీ విగ్రహం వరకు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టిన మహోన్నత వ్యక్తి నేతాజీ అని కొనియాడారు. నేతాజీ ఆశయాలను కోసం రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్. రామగుండం రెండు నగరపాలక సంస్థలు, 10 మున్సిపాలిటీ లల్లో పోటీ చేస్తున్నట్లు బండారి శేఖర్ తెలిపారు. సింహం గుర్తుమీద పోటీ చేసే ఆశవహులు పార్టీ లో జాయిన్ కావాలని, పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నగరపాలక, 10 మున్సిపాలిటీ లల్లో 86 మంది సింహం గుర్తు కోసం దరఖాస్థులు పెట్టుకున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో AIFB జాతీయ ప్రధాన కార్యదర్శి జిదేవరాజన్ మున్సిపల్ ఎన్నికలపై దిశ నిర్దేశం చేసారని తెలిపారు. ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణతో సింహం గుర్తును ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ లో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు, ఎత్తుగాడాలు మరియు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. కచ్చితంగా ఉమ్మడి జిల్లాలో మున్సిపల్,కార్పొరేషన్ ఎన్నికల్లో పార్వర్డ్ బ్లాక్ సత్తా చాటుతామణి అన్నారు. పోటీ చేసే ఆశవహులు పార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు కోసం పార్టీ జిల్లా కమిటీకి దరఖాస్తూ పెట్టుకోవాలని, పార్టీ సభ్యత్వం తీసుకోవాలని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పోటీ చేసే వారికీ పార్టీ బి-ఫామ్ లు అన్నీ కూడా పార్టీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆమోదంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ నాయకత్వం ఆశవహులుకు సంహం గుర్తు బి -ఫామ్ లు ఇస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సింహం గుర్తు ఆశవహులు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ నాయకత్వాన్ని సంప్రదించాలని అన్నారు.
No Comment! Be the first one.