పోస్టర్ ఆవిస్కరించిన ఎమ్మెల్యే గంగుల
16వ జూనియర్ మాస్టర్స్ , దివ్యాంగ్ ,పురుషులు, మహిళల బాడీబిల్డింగ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ – 2026 కు సంబంధించిన వాల్ పోస్టర్లను శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల...

16వ జూనియర్ మాస్టర్స్ , దివ్యాంగ్ ,పురుషులు, మహిళల బాడీబిల్డింగ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ – 2026 కు సంబంధించిన వాల్ పోస్టర్లను శుక్రవారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.కరీంనగర్ నగరం త్వరలో ఒక జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ కు వేదిక కానుందనీ తెలంగాణ బాడీ బిల్డర్స్ అసోసియేషన్‌కు అనుబంధంగా, ఇండియన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందిన కరీంనగర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ఆ ధ్వర్యంలో 16వ జూనియర్ మాస్టర్స్ దివ్యాంగ్ ,పురుషులు మరియు ,మహిళల బాడీబిల్డింగ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ – 2026 పోటీలను ఫిబ్రవరి 7, 8వ తేదీలలో నగరంలోని వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా సుమారు 500 మంది అథ్లెట్లతో పాటు ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఇతర జాతీయ సంస్థల బాడీబిల్డర్లు కూడా పాల్గొనున్నారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, రెనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మెన్ డా. బంగారి స్వామి, కే బి బి ఏ అధ్యక్షులు డా. మొహమ్మద్ ముస్తాక్ అలీ,సెక్రటరీ మహమ్మద్ ఇమ్తియాజ్,మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్,మేచినేని అశోక్ రావు,దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ , పలువురు నాయకులు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.