దేశ ఆర్ధిక వ్యవస్థలో విశ్వకర్మల పాత్ర కీలకం-కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ “విశ్వకర్మ బ్రాహ్మణులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం...

కరీంనగర్
“విశ్వకర్మ బ్రాహ్మణులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం దాదాపు రూ.13 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈరోజు కరీంనగర్ లోని మొగ్దూంపూర్ లో విశ్వబ్రాహ్మణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖద్వార నిర్మాణ పనుల్లో భాగంగా హాజరై శంకుస్థాపన చేశారు. గత 11 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం విశ్వకర్మ సమాజానికి చెందిన సంప్రదాయ వృత్తిదారుల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించిందన్నారు. స్కిల్ ఇండియా, డీడీయూ జీకేవై వంటి కార్యక్రమాల ద్వారా విశ్వకర్మలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు బండి సంజయ్ 41 డివిజన్ వావిలాలపల్లి లో కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అట్లాగే 46వ డివిజన్ లో కేబీ బ్యాంకెట్ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ బండారు వేణుతోపాటు స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.
No Comment! Be the first one.