ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టవద్దు కరీంనగర్లో బంగారు స్వామినాథన్ గారి విగ్రహ ఆవిష్కరణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఘాటైన హెచ్చరిక
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఐక్యతను భంగపెట్టేలా ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టి పరస్పర విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర...

కరీంనగర్ :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఐక్యతను భంగపెట్టేలా ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చు పెట్టి పరస్పర విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఘాటుగా హెచ్చరించారు. కరీంనగర్‌లోని టీఎన్జీవోల సంఘ భవనంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా జేఎసి చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు దివంగత బంగారు స్వామినాథన్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ , టీఎన్జీవోల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) లు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామినాథన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారి సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు నాయకులు ఘన నివాళులు అర్పించారు. స్వామినాథన్ సతీమణికి సంఘం తరఫున నగదు సహాయంతో పాటు బట్టలను అందజేశారు. ఈ సంధర్బంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ప్రస్తుతం ఒకే ఒక్క ఉద్యోగ సంఘాన్ని ప్రత్యేకంగా దగ్గర చేసుకుని వత్తాసు పలుకుతూ మిగిలిన ఉద్యోగ సంఘాలను నిర్లక్ష్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమని ఆయన విమర్శించారు. ఈ విధానం వల్ల ఉద్యోగుల్లో అయోమయం, అసంతృప్తి పెరిగి రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సును కాపాడడమే ఉద్యోగ సంఘాల ప్రధాన లక్ష్యమని, అలాంటి సంఘాలను ప్రభుత్వం సమానంగా గౌరవించి హక్కుల సాధనలో భరోసాగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి పక్కన నిలబడి చూస్తే టీఎన్జీవోల సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోదని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు అనుభవజ్ఞులని, చులకనగా చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే చర్యగా మారుతుందని తెలిపారు. ఉద్యోగులను కేవలం పనిముట్లుగా చూడడం, ఉద్యోగ సంఘాలను విభజన రాజకీయాలకు ఉపయోగించడం తగదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీని వేదికగా చేసుకొని ఉద్యోగ సంఘాలన్నింటితో సమన్వయం పాటిస్తూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల హక్కుల సాధన విషయంలో టీఎన్జీవోల సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఉద్యోగుల గౌరవం, హక్కులు, భద్రత కోసం ముందువరుసలో నిలబడి పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెలకు కనీసం రూ.1500 కోట్లను విడుదల చేస్తూ, అత్యవసర బిల్లుల క్లియరెన్స్‌కు ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కోరారు. సరెండర్ లీవ్ బిల్లులు, జీపీఎఫ్ బిల్లులు మరియు ఇతర అన్ని బిల్లులను సత్వరమే విడుదల చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, త్వరలోనే జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగుల కోసం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ను ఈ నెలలోనే పూర్తి చేసి, ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి, సంగేం లక్ష్మణరావు కేంద్ర సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, జిల్లా నాయకులు ముప్పిడి కిరణ్ కుమార్, రవీందర్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, సర్దార్ హర్మేందర్ సింగ్, మేన్నేని సందీప్ రావు, ఇరుమల్ల శారద , లేంకల సబితా రెడ్డి, గంగారపు రమేష్ గౌడ్ ,సునీతా మారుపాక రాజేష్ భరద్వాజ్, లిచాల సుమంత్ రావు, కోడూరి వాస్తవి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, పోలు కిషన్, అంబటి నాగరాజు, చింతల సందీప్, లక్ష్మీప్రసాద్, కామ సతీష్ గిరిధర్ రావు, ప్రభాకర్, రాజిరెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోట రామస్వామిచ శంకరయ్య, పెన్షనర్ల సంఘం నాయకులు కేశవరెడ్డి, లింగయ్య, పర్రే రాజేశం, ఎం ఏ హమీద్, గాజుల నరసయ్య, సత్యనారాయణ, శంకర్ యాదవ్, ప్రసాద్ రెడ్డి, నాగుల అనిల్ కుమార్, సర్దార్ మన్మీత్ సింగ్, మల్క రాజేశ్వర్ రావు, పాలవేడు శ్రీనివాస్, అక్బర్ హుస్సేన్, బీమ్ రావు, బల్బీర్ సింగ్, రాజేశ్వర్ రావు, భాస పవన్ కుమార్, పులి నగేష్ గౌడ్, వెలిచాల శ్రీనివాస్ రావు, మన్నె సరిత, పోరెడ్డి విజయలక్ష్మి, రాధాకృష్ణారెడ్డి, కొండయ్య, రాజ మల్లయ్య అశోక్, హరిప్రియ, సుస్మిత, లవ కుమార్, రాజు, సుధాకర్ రెడ్డి, ఎడ్ల మహేష్, కయ్యం శ్రీనివాస్, అజ్గర్ అలీ, జాడ కమలాకర్, ఒంటెల వెంకట రెడ్డి, మహమ్మద్ శంషుద్దీన్, అన్నాడి శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
No Comment! Be the first one.