సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
చొప్పదండి: ఈ నెల 5వ తేదీన మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం పనులు కొనసాగుతున్నాయి. సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, జిల్లా అధికారులతో కలిసి...

చొప్పదండి:
ఈ నెల 5వ తేదీన మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం పనులు కొనసాగుతున్నాయి. సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, జిల్లా అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ,స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సభాస్థలనీ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
No Comment! Be the first one.