సినిమా థియేటర్లలో రోడ్డు భద్రతపై అవగాహన
కరీంనగర్ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2026 క్యాలెండర్ 16 వ రోజు కార్యక్రమం లో భాగం గా జిల్లా రవాణాశాఖ డి.టి.సి పి.పురుషోత్తం గారి ఆదేశాల మేరకు డి.టీ.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి నేతృత్వం లో సినిమా...

కరీంనగర్
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు 2026 క్యాలెండర్ 16 వ రోజు కార్యక్రమం లో భాగం గా జిల్లా రవాణాశాఖ డి.టి.సి పి.పురుషోత్తం గారి ఆదేశాల మేరకు డి.టీ.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి నేతృత్వం లో సినిమా థియేటర్ల లోపల రీల్స్ ,స్లైడ్స్, వీడియో క్లిప్పింగ్ ల ద్వార ట్రాఫిక్ నియమాల అమలు, రహదారి ప్రమాదాల నివారణ చర్యలు,రోడ్డు భద్రత కు సంబంధించిన అవగాహన కార్యక్రమాల ను నిర్వహించే క్రమంలో కరీం నగర్ పట్టణం లోని మమత థియేటర్ ను సందర్శించారు. థియేటర్ లో నడుస్తున్న మన శంకర వర ప్రసాద్ సినిమా మ్యాట్నీ షో విడుదలైన తర్వాత ఆ సినిమా చూసిన వీక్షకులతో పాటు ఫస్ట్ షో చూడడానికి వచ్చిన ప్రేక్షకుల ను ఉద్దేశించి డి.టి.ఓ శ్రీకాంత్ చక్ర వర్తి మాట్లాడుతూ మానవ జీవనం లో అత్యంత ఉత్సాహాన్ని కలిగించి వారి దినచర్య ల పట్ల కార్యోన్ముఖులను చేసే బలమైన సాధన మైన వినోదాన్ని పంచే సినిమాల లో హీరోలు చేసే ఫీట్లను యధాతథం గా ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదాల బారిన పడరాదనీ, వివిధ వాహనాల లో రహదారుల పై ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాల ను త్రికరణ శుద్ధి గా పాటించాలని హెల్మెట్ లేకుండ ద్విచక్ర వాహనాల ను ,సీట్ బెల్ట్ ధరించకుండా కార్లు తదితర ఫోర్ వీలర్లను నడపరాదని,అదే విధం గా మద్యం సేవించి గానీ , నిద్ర మత్తు లో గాని ,అలసట గా ఉన్నప్పుడు గానీ వాహనాల ను నడుపుతూ ప్రమాదాల ను కొని తెచ్చుకోరాదని హితవు పలికారు. రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ డాక్టర్ నీలం సంపత్ మాట్లాడుతూ దేశం లో, రాష్ట్రం లో 37 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల క్యాలెండర్ లో 16 వ రోజు కార్యక్రమం లో వినోదం కోసం సినిమాలు చూడడానికి వెళ్లే వారికి ,పబ్లిక్ ప్రదేశాల లో సంచరించే వారికి రహదారి భద్రత పై అవగాహన కల్పించే క్రమంలో స్థానిక మమత థియేటర్ లో సినిమాను చూడడానికి వచ్చిన ప్రేక్షకుల ను కలవడం జరిగిందని, థియేటర్లో సినిమా చూడడానికి వచ్చిన మీరంతా భద్రత తో మీమీ ఇండ్ల ను చేరుకుని థియేటర్లో మీరు పొందిన సంతోషాన్ని మీకిష్టమైన కుటుంబ సభ్యుల తో పంచుకోవాలంటే మీరంతా రహదారి భద్రత నియమాల ను పాటించాలని చెప్పారు. ఓ వైపు మోర్త్ మరో వైపు మన రాష్ట్ర రవాణాశాఖ ఎంతో అంకిత భావం తో ఈ మాసోత్సవాల ను నిర్వహిస్తున్న నేఫథ్యం లో కరీం నగర్ జిల్లా రవాణాశాఖ పట్టణ రహదారుల ను ప్రమాదాల రహిత రహదారులు గా మార్చడానికి కృషిచేస్తుందని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమం లో యమ్. వి.ఐ రవి కుమార్ , ఏ. యమ్.వి.ఐ స్రవంతి తో పాటు రవాణాశాఖ సిబ్భంది పాల్గొన్నారు.
No Comment! Be the first one.