సమ్మక్క సారలమ్మ జాతరలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి.. –కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు.. –రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న వెలిచాల..
కరీంనగర్ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సూచించారు. 19వ...

కరీంనగర్
రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సూచించారు. 19వ డివిజన్ రేకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాలబద్రి శోభారాణి శంకర్ ఆహ్వానం మేరకు ఆదివారం రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మ వార్లను రాజేందర్ రావు దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు జాతర ఏర్పాట్లను పరిశీలించి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈఓ, సంబంధిత అధికారులకు రాజేందర్ రావు సూచించారు. అదనంగా సౌకర్యాలు ఏమైనా అవసరం ఉంటే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడతానని, జాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూస్తానని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పనిచేయాలని రాజేందర్ రావు పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీస్సులు కరీంనగర్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలందరినీ చల్లగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు.. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కరీంనగర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. రాజేంద్ర రావుకు జాతర కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ అధ్యక్షుడు అస్తపురం దీక్షిత్ , స్థానిక కాంగ్రెస్ నాయకులు దుర్గం సుధీర్ కుమార్ , దుర్గం శేఖర్ , 20వ డివిజన్ అధ్యక్షులు అస్తపురం రమేష్ 20వ డివిజన్ ఇంచార్జ్ అస్తపురం తిరుమల, అక్క పెళ్లి మల్లేశం , హస్తపురం కొమురయ్య , చంటి మహేష్ , గంగిపల్లి సంపత్ , గోనే సురేష్ , లింగంపల్లి లక్ష్మయ్య , జాడి అశోక్, హేమంత్ , అస్తపురం రాజయ్య, గ్రామ పెద్దలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.