వెలిచాల ప్రజా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. –జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన వెలిచాల రాజేందర్ రావు
వెలిచాల ప్రజా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. –జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన వెలిచాల రాజేందర్ రావ కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో సోమవారం భారత గణతంత్ర దినోత్సవ...

వెలిచాల ప్రజా కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ
వేడుకలు..
–జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన వెలిచాల రాజేందర్ రావ
కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో సోమవారం భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, గౌరవం కల్పించిందన్నారు. ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. జనవరి 26 దేశ ప్రజలందరికీ గర్వకారణమైన పండుగ అని తెలిపారు.ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం విస్తృత స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పేదల సంక్షేమం, యువత ఉపాధి, మహిళల సాధికారతే ప్రభుత్వ ప్రాధాన్యతలుగా కొనసాగుతున్నాయని చెప్పారు.అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కన్న కలలను సాకారం చేయాలంటే ప్రతి ఒక్కరూ దేశ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత చదువుతో పాటు దేశభక్తిని పెంపొందించుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మీసా రమాదేవి కోడూరు రవీందర్ గౌడ్ ఆకుల నరసన్న కాంగ్రెస్ నాయకులు నందెల్లి ప్రకాష్ అనంతుల రమేష్, వేల్పుల వెంకటేష్, పోరండ్ల రమేష్, వజీరు, లక్ష్మణ్ రాజు, గండి శ్యామ్, గండి గణేష్ కర్రె రాజు, వెలిచాల రాజేందర్ రావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాసారపు కిరణ్ కుమార్, పెద్ది శ్రీనివాస్, రాచర్ల పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No Comment! Be the first one.