మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. –కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి...

కరీంనగర్
మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఆదివారం రాత్రి 32 డివిజన్ హుస్సేన్ పురలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి డివిజన్ కాంగ్రెస్ నాయకుడు ఎం ఏ అహ్మద్ నవీద్ తో కలిసి రాజేందర్ రావ్ ప్రారంభించారు. అంతకుముందు రాజేందర్ రావ్ వారితో కలిసి నాకా చౌరస్తా నుంచి ర్యాలీగా 32వ డివిజన్ హుస్సేన్ పురకు తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మైనార్టీ సోదరులకు ప్రజలకు అభివాదం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేందర్రావు మాట్లాడుతూ మా తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావుతో మైనార్టీ సన్నిహిత సంబంధాలు ఉండేవని మైనార్టీల సంక్షేమానికి జగపతిరావు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలో జగపతిరావు కరీంనగర్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని తెలిపారు. కరీంనగర్లో గల్లి గల్లికి వెళ్లిన జగపతిరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని తెలిపారు. జగపతిరావు ఆశయాల సాధనకు నిరంతరం పాటుపడుతున్నానని కరీంనగర్ ప్రజల బాగోగుల కోసమే నిరంతరం తపన పడుతున్నానని రాజేందర్ రావు చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సమద్ నవాబ్ మా తండ్రి జగపతిరావుకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. ఆయన కుమారుడు నవీద్ కు ప్రజల్లోనూ మంచి పేరు ఉందని డివిజన్ ప్రజలు ఆదరించాలని రాజేందర్రావు కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మైనార్టీలంతా గెలిపించాలని తద్వారా మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డివిజన్ నాయకులు మైనార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No Comment! Be the first one.