మేడారం జాతర షురూ ‼️* తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు సర్వం సిద్ధం —
వరంగల్ ; తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల...

వరంగల్ ;
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 28న ప్రారంభమై 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే మహా జాతరకు కోటికి పైగా భక్తులు తరలివస్తారు.
తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒడిస్సా ఇలా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం రూ.251 కోట్లతో మేడారాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసింది.
మేడారం ప్రస్తుతం భక్తులకు కొత్త హంగులతో దర్శనమిస్తుంది. మహా జాతరకు వచ్చే భక్తుల కోసం గత ప్రభుత్వాలు చాలావరకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానికి పుల్ స్టాప్ పెట్టేలా రెండు శతాబ్దాల వరకు చెక్కుచెదరకుండా ఉండేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేసింది. గద్దెల ప్రాంగణంలో రాతి కట్టడాలను నిర్మించింది. శిల్పాల పైన గిరిజన సంప్రదాయం ఆచార వ్యవహారాలకు సంబంధించిన కళాకృతులను చెక్కడం ద్వారా తరతరాలకు ఆ తల్లుల చరిత్రను తెలిపే ప్రయత్నం చేసింది.
జాతర ప్రాంగణంలోని ప్రతి కూడలిని అందంగా తీర్చిదిద్దారు.గిరిజన సంప్రదాయం ప్రతిబింబించేలా అనేక శిల్పాలను ఏర్పాటు చేయడంతో చూపరులకు ఎంతో ఆనందాన్ని ఆసక్తిని కలిగిస్తుంది.
28న బుధవారం రోజున పునుగొండ్ల గ్రామం నుంచి పడిగిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు, కన్నెపల్లి నుంచి సరాలమ్మను తీసుకువచ్చి ఆ గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈనెల 29న గురువారం రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని కుంకుమ భరిణి రూపంలో తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఈనెల 30వ తేదీన శుక్రవారం రోజున గద్దెలపై వారంతా కొలువై ఉంటారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 31వ తేదీన శనివారం రోజున సాయంత్రం తల్లులు తిరిగి వన ప్రవేశం చెందడంతో ఈ జాతర ముగుస్తుంది.
No Comment! Be the first one.