మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతే.. ఛైర్మన్, మేయర్ అభ్యర్థుల ప్రకటన
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఛైర్మన్, మేయర్ అభ్యర్థులను ప్రకటించాలని నాయకులను ఆదేశించారు. ఎన్నికలకు ముందే పేర్లు ప్రకటిస్తే పార్టీ ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉందని సీఎం హెచ్చరించారు. చాలా మంది నాయకులు ఈ పదవుల కోసం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
No Comment! Be the first one.