మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్* *6 గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి?* *రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యలే* *బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లే* *కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుండి తెస్తుంది* *పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నరు* *పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే… కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుంది* *కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే… * *నేను పైసలు తీసుకొస్తే… బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారు* *కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది* *కరీంనగర్ కోసం నేను తెచ్చిన నిధుల వివరాలివిగో…. * *గంగుల….మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో…* *కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…* *కరీంనగర్ కిసాన్ నగర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్*
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంటి పన్ను పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు...

కరీంనగర్
మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంటి పన్ను పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమైందని అన్నారు. 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అరాచకాలు, కబ్జాలతో ప్రజలను అరిగోస పెట్టిన బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఓటేయాలని నిలదీశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్ధి కోసం నిధులు ఎక్కడి నుండి తెస్తుందని ప్రశ్నించారు. పొరపాటున బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో పడ్డట్లేనని చెప్పారు.
పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే… కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని అన్నారు. కరీంనగర్ లో జరిగిన అభివ్రుద్ధి అంతా కేంద్ర నిధులతోనే స్పష్టం చేశారు. తాను కేంద్రం నుండి నిధులు తీసుకొస్తే. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి ఆ నిధులు తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చి కరీంనగర్ ను అన్ని విధాలా అభివ్రుద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కరీంనగర్ కు బండి సంజయ్ నయాపైసా తీసుకువచ్చినట్లు రుజువు చేస్తే … కరీంనగర్ వదిలి వెళ్లిపోతానన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను ధీటైన రీతిలో తిప్పికొట్టారు. ‘‘ఇదిగో బుక్ లెట్. కరీంనగర్ కోసం నేను తెచ్చిన నిధుల వివరాలన్ని ఇందులో ఉన్నయ్. 5 లక్షల కాపీలను ప్రింట్ చేసి ఇంటింటికీ పంపిస్తున్నా… ఆ బుక్ లో నేను ఎన్ని నిధులు తెచ్చాను? ఏయే అభివ్రుద్ధి పనులు చేశానో అన్నీ ఉన్నాయి. గంగుల కమలాకర్…ఇచ్చిన మాట ప్రకారం…ఇగ మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో…’’అని వ్యాఖ్యానించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 28, 29, 30, 35, 36 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత కిసాన్ నగర్ లో, ఆ తరువాత కాపువాడ మారుతీనగర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సభలకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
కరీంనగర్ లో గల్లీగల్లీ తిరిగిన. 10 ఏళ్ల క్రితం కరీంనగర్ ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే స్మార్ట్ సిటీసహా అనేక రూపాల్లో నిధులు తీసుకొచ్చి అభివ్రుద్ధి చేసిన. నీళ్ల కోసం రూ.134 కోట్లు తీసుకొచ్చిన. నిన్నగాక మొన్న కేంద్రం నుండి రూ.50 కోట్లు తీసుకొచ్చిన. ఆ డబ్బులన్నీ కార్పొరేషన్ లో ఉన్నయ్. ఎన్నికలైపోంగనే అభివ్రుద్ధివ పనులకు శ్రీకారం చుడతా. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓట్లేస్తే ఆ పైసలన్నీ దారి మళ్లిస్తరు. కమీషన్లు సంపుకుంటున్నారు. వడ్డించేటోడు మనోడైతే అఖరి బంతిలో ఉన్న అన్నీ వడ్డిస్తరు. అట్లాగే నిధులు ఇచ్చేది, తెచ్చేది బీజేపీయే కాబట్టి…. బీజేపీకి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే కార్పొరేటర్లందరితో కలిసి మోదీ వద్దకు వెళతా. మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివ్రుద్ది చేస్తా.
నేను మొదటి నుండి కరీంనగర్ ప్రజల కోసం పోరాడిన. అనేక సార్లు జైలుకు పోయిన. మీ దయవల్ల ఎంపీగా గెలిచినంక పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీకి అప్పగిస్తే…. ఇంకా నిధులిస్తానని ప్రధాని మోదీ చెప్పారు. మోదీ మాటను మీ ముందుంచుతున్నా.
ఇగ బీఆర్ఎస్ విషయానికొస్తే… పదేళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారు? అవినీతి, అక్రమాలు, కబ్జాలు చేసి పేదల ఉసురు పోసుకున్నరు. కబ్జాలకు పాల్పడి జైలుకు పోయినోళ్లలో సగం మందికి బీఆర్ఎస్ లో టిక్కెట్లు ఇచ్చారు. వాళ్లకు ఓట్లేసే ఇగ మీ జాగాలతోపాటు పుస్తెల తాడు కూడా గుంజుకుపోతారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. నేను నయాపైసా తీసుకురాలేదని అబద్దాలాడుతున్నరు. ఇదిగో బుక్ లెట్. నేను కరీంనగర్ కోసం ఎన్ని నిధులు తెచ్చాను, ఏయే అభివ్రుద్ది పనులు చేశానో వివరాలన్నీ ఈ బుక్ లెట్ రూపొందించిన. 5 లక్షల పుస్తకాలను ప్రింట్ చేసి ఇంటింటికీ పంపుతున్నా. వందల కోట్ల రూపాయల నిధుల వివరాలన్నీ అందులో ఉన్నయ్. గంగుల కమలాకర్… ఇగ నువ్వు మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోతావా?..వెళ్లిపో…. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎన్నికలప్పుడు తప్ప ఎన్నడూ కన్పించలే. ప్రజలు ఆయనను ఎన్నడో మర్చిపోయారు. ఆయన మాటలను ఎవరు పట్టించుకుంటారు? కేంద్రంలో, అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓట్లేసి ప్రయోజనం ఏమిటి? బీఆర్ఎస్ కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. పొరపాటున బీఆర్ఎస్ ను గెలిపిస్తే… కేంద్రం ఇచ్చిన పైసలను దారి మళ్లించి కమీషన్లు దొబ్బుకుంటారే తప్ప చేసేదేమీ లేదు.
ఇగ కాంగ్రెస్ విషయానికొస్తే…మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంటి పన్ను పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? మహిళలకు నెలనెలా రూ.2500లు ఇచ్చారా? స్కూటీలు, తులం బంగారం ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిచ్చారా? అసలు ఎందుకు ఓటేయాలి? నన్ను కోసినా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే చెబుతున్నడు. ఇగ యాడనుండి తెచ్చి కరీంనగర్ ను అభివ్రుద్ధి చేస్తారో చెప్పాలి. కరీంనగర్ కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యకుండా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారు?. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను 6 గ్యారంటీలపై నిలదీయండి. నిధులు ఎక్కడి తెచ్చి అభివ్రుద్ధి చేస్తారో చెప్పాలని అడగండి.
బీజేపీ అభ్యర్థుల మీద అవినీతి ఆరోపణలు లేవు. కబ్జాల చరిత్ర లేదు. దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం, కరీంనగర్ కోసం నిరంతరం కష్టపడుతున్నరు. కాషాయ జెండా పట్టి జై శ్రీరాం అంటూ మీ సమస్యల కోసం కొట్లాడుతున్నరు. లాఠీ దెబ్బలు తిన్నరు. జైలుకు పోయారు. నన్ను ఎంపీగా గెలిపించేందుకు ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించారు. ఇయాళ వాళ్ల కోసం మీ వద్దకు వచ్చిన. వాళ్లను గెలిపించండి.
తాగి పాలనను గాలికొదిలేసి ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ నే పోరాటాలు చేసి గల్లాపట్టి బయటకు వచ్చేలా చేసిన. అఫ్ట్రాల్ కాంగ్రెస్ ఎంత? 3 రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ. 2028లో తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. కేంద్రం నుండి ఇంకా నిధులు తీసుకొస్తా. నిజాయితీగా పనిచేస్తానని హామీ ఇస్తున్నా.
No Comment! Be the first one.