మున్సిపల్ ఎన్నికలకు సిపిఐ శ్రేణులు సిద్ధం కండి. కరీంనగర్ కార్పొరేషన్ లో అడుగు పెట్టండి. సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపు.
కరీంనగర్ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని,కరీంనగర్ కార్పొరేషన్ లో సిపిఐ...

కరీంనగర్
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని,కరీంనగర్ కార్పొరేషన్ లో సిపిఐ కార్పొరేటర్లుగా అడుగు పెట్టాలని సిపిఐ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే,సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం నాడు కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నగరానికి చెందిన సిపిఐ ముఖ్య నాయకులతో చాడ వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ అను నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం,వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పార్టీ సిపిఐ అని,గత అనేక సంవత్సరాలుగా నగరంలో ఉన్న సమస్యలు,వార్డుల్లో ఉన్న సమస్యలపై నగర పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నారని,రోడ్లు, డ్రైనేజీలతో పాటు,గతంలో స్మార్ట్ సిటీ పేరుతో నిర్మించిన రోడ్ల, ఫుట్ పాత్ ల నిర్మాణాలపై అలాగే తీగల వంతెన నిర్మాణ నాణ్యతపై,మానేరు రివర్ ఫ్రంట్ పై పోరాటాలు చేశామని,వాటి నిర్మాణంలో జరిగిన అవినీతిపై,అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన ఏకైక పార్టీ సిపిఐ అని చాడ వెంకటరెడ్డి అన్నారు.
నగరంలో నివసిస్తున్న పేద,బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని,నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదలకు కేటాయించాలని,అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పెన్షన్ ఇవ్వాలని,నగరంలో నివసిస్తున్న పేదలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింప జేయాలని అనేక దఫాలుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి పోరాడిన పార్టీ సిపిఐ అని అలాంటి పార్టీని నగర ప్రజలు ఆదరించాలని,రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని,పోటీ చేసే వారు ప్రజల మధ్య ఉండి వారికి సేవ చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి,సహాయ కార్యదర్శి న్యాలపట్ల రాజు,నగర నాయకులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి,గామినేని సత్యం,మాడిశెట్టి అరవింద్,బాకం ఆంజనేయులు,కూన రవి,నేదునూరి లక్ష్మణ్,రాములు తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.